రాబోయేది మరింత కష్టకాలం
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:20 AM
పశ్చిమాసియా యుద్ధం కారణంగా మరింత కష్టమైన వ్యాపార వాతావరణానికి సంసిద్ధులు కావాలని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. తమ గ్రూప్ కంపెనీల...
టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా మరింత కష్టమైన వ్యాపార వాతావరణానికి సంసిద్ధులు కావాలని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. తమ గ్రూప్ కంపెనీల సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లకు సూచించారు. పశ్చిమాసియా యుద్ధం మొత్తం సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేసిందని, ఈ నేపథ్యంలో వ్యాపార నిర్వహణ మరింత క్లిష్టంగా మారనుందని చంద్ర హెచ్చరించారు. వోల్టాస్, టీసీఎస్, ఇండియన్ హోటల్స్, టైటాన్ సహా పలు టాటా గ్రూప్ కంపెనీలకు చెందిన 10 వేల మంది ఉద్యోగులు పశ్చిమాసియాలో చిక్కుకుపోయారంటూ వారిని సురక్షితంగా దేశానికి తరలించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. సరఫరా అంతరాయాలు, కమోడిటీ ధరల పెరుగుదలతో మార్జిన్లపై పెరగనున్న ఒత్తిడి, నిర్వహణాపరమైన వ్యయాల పెరుగుదల వంటి భిన్న అంశాలపై వారితో ఆయన చర్చించారు.
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News