Share News

తాన్లా లాభం రూ.131 కోట్లు

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:43 AM

తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను

తాన్లా లాభం రూ.131 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ రూ.1,121 కోట్ల కన్సాలిడేటెడ్‌ రెవెన్యూపై రూ.131 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.1,009.82 కోట్లుగా ఉండగా లాభం రూ.118.51 కోట్లు గా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ తొలిసారిగా రూ.1,100 కోట్ల మార్కును అధిగమించించటంతో పాటు అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయని తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ సీఈఓ ఉదయ్‌ రెడ్డి అన్నారు. టెలికాం, ఎంటర్‌ప్రైజెస్‌ కోసం ఇన్నోవేటివ్‌ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు గాను వైజ్లీ.ఏఐలో పెట్టుబడులు పెట్టడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి..

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 23 , 2026 | 02:43 AM