‘స్కైరూట్‌లో స్విగ్గీ ప్రమోటర్ల పెట్టుబడి
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:05 AM
స్పేస్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పే్‌స’లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు బారులు తీరుతున్నారు....
హైదరాబాద్: స్పేస్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పే్‌స’లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు బారులు తీరుతున్నారు. ఇటీవలే 125 కోట్ల డాలర్ల వాల్యుయేషన్‌తో యూనికార్న్‌గా మారిన ఈ హైదరాబాద్ స్టార్టప్ కంపెనీలో తాజాగా స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి, మాజీ సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి చెరో రూ.4.99 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ మొత్తంలో వీరిద్దరూ చెరో 202 కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లు (సీసీపీఎస్) కొనుగోలు చేసినట్టు స్కైరూట్ ఏరోస్పేస్ రెగ్యులేటరీ ఫైలింగ్స్ వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..