Share News

నవయుగకు ‘సుప్రీం’లో ఊరట

ABN , Publish Date - May 27 , 2026 | 05:23 AM

తీస్తా ేస్టజ్‌-3 ప్రాజెక్టుకు సంబంధించిన కార్మిక సంక్షేమ నిధి వివాదంలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలోని నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌...

నవయుగకు ‘సుప్రీం’లో ఊరట

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): తీస్తా ేస్టజ్‌-3 ప్రాజెక్టుకు సంబంధించిన కార్మిక సంక్షేమ నిధి వివాదంలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలోని నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌, ఎస్‌ఈడబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌ లిమిటెడ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ రెండు సంస్థలకు అనుకూలంగా గతంలో వెలువడిన ఆర్బిట్రల్‌ అవార్డును (మధ్యవర్తిత్వ తీర్పు) అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సిక్కిం హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. తీస్తా ేస్టజ్‌-3 ప్రాజెక్టు పనుల కోసం నవయుగ, ఎస్‌ఈడబ్ల్యూ, అబీర్‌ ఇన్‌ఫ్రా సంస్థలు ఒక కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్మిక సంక్షేమ నిధి వివాదంలో ట్రైబ్యునల్‌ ఈ కన్సార్షియానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో సిక్కిం ఊర్జ లిమిటెడ్‌ హైకోర్టులో సవాల్‌ చేసింది. ట్రైబ్యునల్‌ తీర్పును సిక్కిం హైకోర్టు రద్దు చేసింది.

హైకోర్టు తీర్పును నవయుగ, ఎస్‌ఈడబ్ల్యూ సంస్థలు.. సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాయి. మరో భాగస్వామ్య సంస్థ అయిన అబీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు. ఈ క్రమంలో పిటిషన్లను విచారించిన జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం నవయుగ, ఎస్‌ఈడబ్ల్యూలకు మాత్రమే అనుకూలంగా తీర్పునిచ్చింది. గతంలో ఈ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఉన్న నిధులను నవయుగ, ఎస్‌ఈడబ్ల్యూ సంస్థలకు తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేయని కన్సార్షియంలోని అబీర్‌ ఇన్‌ఫ్రాకు మాత్రం ఎలాంటి ఉపశమనం లభించబోదని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..

నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

Updated Date - May 27 , 2026 | 05:23 AM