Share News

మరణించిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఎందుకు చెప్పరు

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:08 AM

చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచడం పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు ఈ వివరాలను వారి చట్టబద్ద వారసులకు ఎందుకు చెప్పరని కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)ను...

మరణించిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఎందుకు చెప్పరు

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచడం పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు ఈ వివరాలను వారి చట్టబద్ద వారసులకు ఎందుకు చెప్పరని కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)ను ప్రశ్నించింది. ఈ వివరాలను చనిపోయిన వ్యక్తుల చట్టబద్ధ వారసులకు వెల్లడించేందుకు ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని కోరింది. జర్నలిస్ట్‌ సుచేత దలాల్‌ దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) విచారిస్తూ జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అనేక దేశాల్లో పది బ్యాంకు ఖాతాలు ఉన్న వ్యక్తి వీలునామా గానీ, కేవైసీ వివరాలు గానీ లేకుండా చనిపోతే.. అతని వారసులకు అతడి బ్యాంకు ఖాతాల వివరాలు ఎలా తెలుస్తాయి? ఈ వివరాలను వారసులకు ఇవ్వడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి? దీనిపై మీరు ఏదో ఒక విధానంతో ముందుకు రండి? అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు మే 5వ తేదీకి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి..

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..

మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 18 , 2026 | 02:08 AM