ఐపీఓకి ట్రెన్‌జెట్ ఇన్‌ఫ్రా
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:10 AM
ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉన్న ట్రెన్‌జెట్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉన్న ట్రెన్‌జెట్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసింది. ఈపీసీ పద్దతిలో రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఈ కంపెనీ నిమగ్నమై ఉంది. ఈ ఐపీఓ ద్వారా 1.05 కోట్ల కొత్త షేర్లతో పాటు ప్రమోటర్లు తమ వాటా నుంచి 18 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) కింద జారీ చేస్తారు. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, యంత్ర పరికరాల కొనుగోలు, ఇతర అవసరాల కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.1,600 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.