Share News

ఆటుపోట్లకు అవకాశం

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:15 AM

ఈ వారం భారత స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్‌-అమెరికా యుద్ధం మళ్లీ మొదలవటంతో పాటు త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరలు, రుతుపవనాల..

ఆటుపోట్లకు అవకాశం

ఈ వారం భారత స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్‌-అమెరికా యుద్ధం మళ్లీ మొదలవటంతో పాటు త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరలు, రుతుపవనాల గమనం ఇందుకు కారణాలుగా ఉండనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మదుపరులు ఆచితూచి వ్యవహరించటం మంచిది. గత వారం రియల్టీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఐటీ రంగాల షేర్లు మూమెంటమ్‌ ప్రదర్శించాయి. మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ప్రైవేట్‌ బ్యాకింగ్‌ వంటి రంగాలు బలహీనంగా ఉన్నాయి.

స్టాక్‌ రికమండేషన్స్‌

ఎన్‌ఎల్‌సీ ఇండియా: చక్కని బేస్‌ బ్రేకౌట్‌ తర్వాత జీవితకాల గరిష్ఠాన్ని అందుకున్న ఈ షేరు ప్రస్తుతం 25 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం ఈ షేరు కీలకమైన రూ.300 స్థాయి లో మద్దతు తీసుకుంది. గత రెండు సెషన్లలో అదరగొట్టింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.314 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.300పై స్థాయిలో ప్రవేశించి రూ.360 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.280 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

కెనరా బ్యాంక్‌: గత ఏడాది మార్చి నుంచి అప్‌ట్రెండ్‌లో సాగుతున్న ఈ షేరు జీవితకాల గరిష్ఠం నుంచి 25 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం అమ్మకాల ఒత్తిడి తగ్గింది. వరుసగా మూడోసారి రూ.130 స్థాయిలో మద్దతు తీసుకుంది. గత శుక్రవారం రూ.128 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.125 శ్రేణిలో ప్రవేశించి రూ.145 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.122 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

పారస్‌ డిఫెన్స్‌: ఏప్రిల్‌ నుంచి 144 శాతం మేర రాబడిని అందించిన ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో చలిస్తోంది. అయితే కాస్త పుల్‌బ్యాక్‌కు లోనైంది. స్వల్పకాల మూవింగ్‌ వద్ద మద్దతు తీసుకుంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగుంది. వాల్యూమ్‌ గణనీయంగా పెరిగింది. గత శుక్రవారం రూ.1,253 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,230 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.1,440 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,200 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


మణప్పురం ఫైనాన్స్‌: ఈ ఏడాది ఆరంభం నుంచి ఏప్రిల్‌ వరకు 22 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ఆ తర్వాత 40 శాతం మేర పుంజుకుంది. చక్కని బేస్‌ బ్రేకౌట్‌ తర్వాత కన్సాలిడేట్‌ అవుతోంది. పైగా రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.341 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.330 వద్ద ప్రవేశించి రూ.390 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.320 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అపోలో మైక్రోసిస్టమ్స్‌: ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 150 శాతం మేర రాబడిని అందించిన ఈ షేరు చక్కటి బేస్‌ బ్రేకౌట్‌ తర్వాత కన్సాలిడేట్‌ అవుతోంది. ట్రెండ్‌ ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.408 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.400 శ్రేణిలో ప్రవేశించి రూ.455 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.380 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు

తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 13 , 2026 | 04:15 AM