4 రోజుల నష్టాలకు తెర
ABN , Publish Date - May 14 , 2026 | 01:37 AM
దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. బుధవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. మెటల్, ఎనర్జీ, వినియోగ షేర్లలో కొనుగోళ్లు...
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. బుధవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. మెటల్, ఎనర్జీ, వినియోగ షేర్లలో కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో బీఎ్‌సఈ సెన్సెక్స్ 49.74 పాయింట్ల లాభంతో 74,608.98 వద్ద ముగిసింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ 75,191.57 పాయింట్ల గరిష్ఠ, 74,134.48 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ 33.05 పాయింట్లు పెరిగి 23,412.60 వద్ద ముగిసింది.
రికార్డు కనిష్టం నుంచి కోలుకున్న రూపాయి: డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం ఒక దశలో ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి రూ.95.80కి క్షీణించింది. అయితే చివరకు కోలుకుని క్రితం రికార్డు కనిష్ఠ స్థాయికి చేరువలో రూ.95.66 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల్లో పెరుగుదల, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఆందోళనలు ఇందుకు కారణం. ఆరంభంలో 16 పైసలు లాభపడిన రూపాయి ఇంట్రాడేలో 95.51 గరిష్ఠ, 95.80 కనిష్ఠ స్థాయిలను చూసింది. చివరకు 2 పైసల లాభంతో 95.66 వద్ద ముగిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్