లాభాల్లోకి మార్కెట్లు
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:14 AM
గత సెషన్ (బుధవారం)లో భారీ పతనం తర్వాత ఇన్వెస్టర్లు విస్తృత స్థాయిలో కొనుగోళ్లకు దిగడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి..
సెన్సెక్స్ 238 పాయింట్లు అప్
ముంబై: గత సెషన్ (బుధవారం)లో భారీ పతనం తర్వాత ఇన్వెస్టర్లు విస్తృత స్థాయిలో కొనుగోళ్లకు దిగడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. లాభాల్లో ప్రారంభమైన ప్రధాన సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో ఒక దశలో 823.05 పాయింట్లు (1.07శాతం) పెరిగి 77,326.65ను తాకింది. అయితే చివరి గంటలో కొంత లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా చివరకు 238.22 పాయింట్ల లాభంతో 76,741.82 వద్ద ముగిసింది. నిఫ్టీ 80.75 పాయింట్లు పెరిగి 23,962.80 వద్ద క్లోజైంది. డాలర్ మారకంలో రూపాయి విలువ కాస్త బలపడింది. గురువారం 1 పైసా పెరిగి రూ.95.47 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పాటు డాలర్ బలపడినప్పటికీ రూపాయి పెరగడం విశేషం.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..