Share News

లాభాల్లో మార్కెట్లు సెన్సెక్స్‌ 505 పాయింట్లు అప్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:02 AM

ఈక్విటీ మార్కెట్లో వారాంతపు రోజున ఆశావీచికలు వీచాయి. అమెరికా, ఇరాన్‌ మధ్య దౌత్యపరమైన పరిష్కారం లభించవచ్చన్న ఆశలు శుక్రవారం మార్కెట్‌ను ముందుకు నడిపించాయి...

లాభాల్లో మార్కెట్లు సెన్సెక్స్‌ 505 పాయింట్లు అప్‌

ముంబై: ఈక్విటీ మార్కెట్లో వారాంతపు రోజున ఆశావీచికలు వీచాయి. అమెరికా, ఇరాన్‌ మధ్య దౌత్యపరమైన పరిష్కారం లభించవచ్చన్న ఆశలు శుక్రవారం మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. దీనికి తోడు క్రూడాయిల్‌ ధరల భారీ తగ్గుదల, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఆ ఉత్సాహాన్ని మరింత పెంచాయి. సెన్సెక్స్‌ 504.86 పాయింట్ల లాభంతో 78,493.54 వద్ద ముగియగా, నిఫ్టీ 156.80 పాయింట్ల లాభంతో 24,353.55 వద్ద క్లోజైంది. వారం మొత్తంలో సెన్సెక్స్‌ 943.29 పాయింట్లు, నిఫ్టీ 302.95 పాయింట్లు లాభపడ్డాయి. ఈ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.84 లక్షల కోట్లు పెరిగి రూ.4,65,64,461.51 కోట్లకు చేరింది.

  • బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 1.76%, మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 1.31% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీలన్నీ కూడా లాభాల్లో ముగిశాయి.

  • అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ రకం క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 3.07% తగ్గి 96.34 డాలర్ల వద్ద స్థిరపడింది.

  • డాలర్‌ మారకంలో రూపాయి విలువ 26 పైసలు పెరిగి 92.91 స్థిరపడింది. ఎక్స్ఛేంజీల వద్ద ఉన్న సమాచారం ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం రూ.382.36 కోట్ల విలువ గల ఈక్విటీలు కొనుగోలు చేశారు.

  • ఏప్రిల్‌ 10వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు 382.5 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 70,094.6 కోట్లకు చేరాయు. ఫిబ్రవరి 27వ తేదీన ఫారెక్స్‌ నిల్వల చారిత్రక గరిష్ఠ స్థాయి 72,894.4 కోట్ల డాలర్లు నమోదైంది.

వెండి, బంగారం వెలవెల

దేశీయ మార్కెట్లో డిమాండ్‌ లేకపోవడంతో శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.5,700 తగ్గి రూ.2.53 లక్షలకు చేరింది. 99.9ు స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం రూ.1,600 క్షీణించి రూ.1,56,200 పలికింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 4,786.90 డాలర్లు, వెండి ధర 79.28 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.

Updated Date - Apr 18 , 2026 | 05:02 AM