లాభాల స్వీకరణతో నష్టాల్లోకి...
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:15 AM
తీవ్ర ఆటుపోట్లతో జరిగిన ట్రేడింగ్‌లో గురువారం స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా ఇటీవల సాధించిన ర్యాలీని సొమ్ము చేసుకునేందుకు...
ముంబై: తీవ్ర ఆటుపోట్లతో జరిగిన ట్రేడింగ్‌లో గురువారం స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా ఇటీవల సాధించిన ర్యాలీని సొమ్ము చేసుకునేందుకు ఇన్వెస్టర్లు లాభాల స్వీకారానికి పాల్పడడం మార్కెట్‌ను నష్టాల్లోకి నడిపించింది. ఆరంభంలో పాజిటివ్‌గానే ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 78,730- 77,674 పాయింట్ల మధ్యన కదలాడి వెయ్యి పాయింట్లకు పైగా ఎగుడుదిగుడులు చవి చూసింది. చివరికి నష్టాన్ని 122.56 పాయింట్లకు పరిమితం చేసుకుని 77,988.68 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా ఆటుపోట్లు సాధించినా చివరికి 34.55 పాయింట్ల నికర నష్టంతో 24,196.75 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి
వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?
'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..