Share News

సూచీలకు స్వల్ప నష్టాలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:44 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ఆరంభించినప్పటికీ...

సూచీలకు స్వల్ప నష్టాలు

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ఆరంభించినప్పటికీ, క్రమంగా తేరుకుని చివరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో పాటు ఆఖరి గంటలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. ప్రారంభంలో 742.43 పాయింట్లు పతనమై 74,160.16 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌.. చివరికి 120.83 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,781.76 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 79.70 పాయింట్లు కోల్పోయి 23,398.10 వద్దకు జారుకుంది.

Updated Date - Sep 12 , 2026 | 04:44 AM