Share News

4 రోజుల ర్యాలీకి బ్రేక్‌

ABN , Publish Date - Jul 08 , 2026 | 02:53 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల ర్యాలీకి తెరపడింది. ఆఖరి అరగంటలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున లాభాలను స్వీకరించడంతో ప్రామాణిక సూచీలు నష్టాల్లో ముగిశాయి....

4 రోజుల ర్యాలీకి బ్రేక్‌

సెన్సెక్స్‌ 104 పాయింట్లు డౌన్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల ర్యాలీకి తెరపడింది. ఆఖరి అరగంటలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున లాభాలను స్వీకరించడంతో ప్రామాణిక సూచీలు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం కూడా లాభాల్లో ప్రారంభమై, ఒక దశలో 380 పాయింట్ల మేర ఎగబాకిన సెన్సెక్స్‌.. చివరికి 104.35 పాయింట్ల నష్టంతో 78,180.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31.65 పాయింట్లు కోల్పో యి 24,398.70 వద్దకు జారుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 16 నష్టపోయాయి. టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్‌ షేరు 12.42 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది.

పబ్లిక్‌ ఇష్యూకు కల్ట్‌ ఫిట్‌: ఫిట్‌నెస్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ కల్ట్‌ ఫిట్‌ కూడా తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు సిద్ధమవుతోంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.950 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన 17.86 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనున్నట్లు డీఆర్‌హెచ్‌పీలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 08 , 2026 | 02:53 AM