Share News

వరుస లాభాలకు బ్రేక్‌

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:15 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు నాలుగు రోజుల పాటు వరుసగా నమోదు చేసిన లాభాల పరంపరకు బ్రేక్‌ పడింది. మంగళవారం సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు నష్టాలతో...

వరుస లాభాలకు బ్రేక్‌

210 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు నాలుగు రోజుల పాటు వరుసగా నమోదు చేసిన లాభాల పరంపరకు బ్రేక్‌ పడింది. మంగళవారం సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ)లో క్లోజింగ్‌ యాక్షన్‌ సెషన్‌ (సీఏఎ్‌స)ను ప్రవేశపెట్టడమే ఇందుకు కారణం. దీంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 210.08 పాయింట్ల నష్టంతో 78,428.95 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 79,143.15 పాయింట్ల గరిష్ఠ, 78,211.87 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 159.40 పాయింట్ల నష్టంతో 24,614.90 వద్ద ముగిసింది.డాలర్‌ మారకంలో రూపాయి విలువ 9 పైసల లాభంతో రూ.95.28 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు బ్యారెల్‌ ధర ఒక ద శలో 2.72 శాతం మేర పెరిగి 86.05 డాలర్ల వద్ద ట్రేడయింది.

Updated Date - Aug 05 , 2026 | 05:15 AM