Share News

లాభ నష్టాల మధ్య ఊగిసలాట

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:22 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభ నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటకు లోనై, చివరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి...

లాభ నష్టాల మధ్య ఊగిసలాట

సెన్సెక్స్‌ 150 పాయింట్లు డౌన్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభ నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటకు లోనై, చివరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 875.59 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్‌.. 150.63 పాయింట్ల నష్టంతో 73,832.55 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53.35 పాయింట్లు కోల్పోయి 23,161.60 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో మదుపరులు ఈక్విటీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ధోరణితో వ్యవహరించారని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

మరో రూ.3,200 తగ్గిన బంగారం: దేశీయంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం మరో రూ.3,220 తగ్గుదలతో రూ.1,45,640కి దిగివచ్చింది. బుధవారం నాడూ తులం పసిడి రూ.4,300 మేర తగ్గింది. కిలో వెండి రేటు మాత్రం ఏ మార్పు లేకుండా రూ.2.60 లక్షలుగా నమోదైంది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు ఒక దశలో 4,072 డాలర్లకు పడిపోగా.. సిల్వర్‌ 63.18 డాలర్ల స్థాయిలో ట్రేడైంది

ఇవి కూడా చదవండి..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:22 AM