Share News

ఐటీ, లోహ షేర్లలో అమ్మకాలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:55 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో 1,000 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్‌.. చివరికి 893.39 పాయింట్ల (1.16 శాతం) నష్టంతో 76,200.68 వద్ద స్థిరపడింది....

ఐటీ, లోహ షేర్లలో అమ్మకాలు

  • సెన్సెక్స్‌ 893 పాయింట్లు పతనం

  • మళ్లీ 24,000 దిగువకు నిఫ్టీ

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో 1,000 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్‌.. చివరికి 893.39 పాయింట్ల (1.16 శాతం) నష్టంతో 76,200.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 278.80 పాయింట్లు (1.16 శాతం) పతనమై 23,824.10 వద్దకు జారుకుంది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావిం చే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5.46 లక్షల కోట్లు తగ్గి రూ.475.10 లక్షల కోట్లకు (5.02 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. ఏఐ బుడగ ఆందోళనల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో టెక్నాలజీ రంగ షేర్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఐటీతో పాటు మెటల్‌ స్టాక్స్‌లో భారీగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది.

బంగారం రూ.3,000.. వెండి రూ.10,500 డౌన్‌

దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9ు స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై రూ.3,000 తగ్గి రూ.1,49,300కు జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.10,500 పతనమై 2 నెలలకు పైగా కనిష్ఠ స్థాయి రూ.2.35 లక్షలకు దిగివచ్చింది. డాలర్‌ బలపడటంతో పాటు అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ విలువైన లోహాల రేట్లు గణనీయంగా తగ్గడం ఇందుకు కారణమైంది.

ఇవి కూడా చదవండి

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

Updated Date - Jun 24 , 2026 | 04:55 AM