ఎన్‌ఎస్ఈలో ఈజీఆర్ ట్రేడింగ్ షురూ
ABN , Publish Date - May 19 , 2026 | 02:02 AM
నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ)లో ఎలకా్ట్రనిక్ గోల్డ్ రిసీట్స్(ఈజీఆర్) లైవ్ ట్రేడింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈజీఆర్‌లకు...
నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ)లో ఎలకా్ట్రనిక్ గోల్డ్ రిసీట్స్(ఈజీఆర్) లైవ్ ట్రేడింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈజీఆర్‌లకు మార్కెట్ వర్గాల నుంచి మంచి స్పందన లభించిందని ఎన్‌ఎస్ఈ పేర్కొంది. భౌతిక బంగారంపై యాజమాన్య హక్కును కల్పించే డీమెటీరియలైజ్డ్ సెక్యూరిటీయే ఈజీఆర్. కొనుగోలు చేసే ఈజీఆర్ యూనిట్లను డీమ్యాట్ ఖాతాలో ఎలకా్ట్రనిక్ రూపంలో కలిగి ఉండవచ్చు. అలాగే, కొనుగోలు చేసిన ఈజీఆర్ యూనిట్లకు సమానమైన బంగారాన్ని సెబీ అధీకృత లాకర్లలో భద్రంగా నిల్వ చేస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్