Share News

టెక్‌ వ్యూ 24,500 వద్ద అప్రమత్త ట్రెండ్‌

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:12 AM

గత వారం నిఫ్టీ 24,500 స్థాయిల వద్ద బలమైన రియాక్షన్‌కు లోనై 23,800 స్థాయిలకు పడిపోయింది. అనంతరం 24,000 ఎగువన రికవరీ కనబరిచింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 64 పాయింట్లు...

టెక్‌ వ్యూ 24,500 వద్ద అప్రమత్త ట్రెండ్‌

గత వారం నిఫ్టీ 24,500 స్థాయిల వద్ద బలమైన రియాక్షన్‌కు లోనై 23,800 స్థాయిలకు పడిపోయింది. అనంతరం 24,000 ఎగువన రికవరీ కనబరిచింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 64 పాయింట్లు (0.26ు) నష్టంతో 24,207 వద్ద క్లోజైంది. నిఫ్టీ గత కొద్ది వారాలుగా 24,500-23800 మధ్యన రేంజ్‌ బౌండ్‌లోనే చిక్కుకుపోయింది. వీక్లీ చార్టుల ప్రకారం చూస్తే కనిష్ఠ స్థాయిల నుంచి బలంగా రికవరీ సాధించినట్లు కనిపిస్తోంది. టెక్నికల్‌గా చూస్తే సూచీ ఎలాంటి సంకేతాలు వెలువరించటం లేదు. అయితే నిలకడైన ట్రెండ్‌తో పాటు ఈ వారం బలంగా క్లోజయితేనే పాజిటివ్‌ ట్రెండ్‌ను సూచిస్తుంది. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా ఎనిమిది వారాల కన్సాలిడేషన్‌ అనంతరం 1.3 శాతం లాభంతో 63,000 ఎగువన క్లోజైంది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 240 పాయింట్ల లాభంతో ముగిసింది.

బుల్లిష్‌ స్థాయిలు: సానుకూల ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధ స్థాయిలైన 24,300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయిలకు ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధ స్థాయి 24,500. గత వారం ఇక్కడ బలమైన కరెక్షన్‌ను చవిచూసింది. గత మూడు నెలలుగా ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోవటంలో విఫలమవుతూ వస్తోంది.స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం 24,500 వద్ద బ్రేకౌట్‌ సాధించాల్సి ఉంటుంది.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ కరెక్షన్‌కు గురయితే తదుపరి మద్దతు స్థాయిలు 24,000 వద్ద ఉంటాయి. గత మూడు నెలలుగా ఈ స్థాయిల వద్ద భారీగా ఒడుదొడుకులకు లోనవుతూ వస్తోంది. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. తదుపరి మద్దతు స్థాయిలు 23,800,23,500.


బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ తొలుత 1,500 పాయింట్లు పతనమై ఆ తర్వాత బలంగా రీబౌండ్‌ అయ్యింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 108 పాయింట్ల లాభంతో 58,050 వద్ద క్లోజైంది. ఈ వారం సానుకూల ట్రెండ్‌ కోసం ఈ సూచీ ప్రధాన నిరోధ స్థాయిలైన 58,000 ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధ స్థాయి 58,700. ఒకవేళ కరెక్షన్‌ను కనబరిస్తే 57,500 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే తదుపరి మద్దతు స్థాయి 56,800.

పాటర్న్‌: నిఫ్టీ.. ప్రస్తుతం 50, 100 రోజుల చలన సగటు ఎగువన ఉంది. ఈ వారం సానుకూల ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. వీక్లీ చార్టులపై నిఫ్టీ మూడు ప్రధాన టాప్స్‌ను ఏర్పరచుకుంది. సానుకూలత కోసం 24,500 వద్ద అడ్డంగా దిగువకు ఏర్పడిన నిరోధ ట్రెండ్‌లైన్‌’ వద్ద అప్‌సైడ్‌ బ్రేకౌట్‌ను సాధించాల్సి ఉంటుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,300, 24,370

మద్దతు : 24,080, 24,000

వి. సుందర్‌ రాజా

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 13 , 2026 | 04:12 AM