టెక్ వ్యూ గరిష్ఠ స్థాయిల వద్ద నిరోధం
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:51 AM
నిఫ్టీ గత వారం తొలుత అప్‌ట్రెండ్‌ను కనబరిచి 24,500 స్థాయిని అధిగమించి మళ్లీ కరెక్షన్‌ను చవిచూసింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 450 పాయింట్లు (మైనస్ 1.87 శాతం) నష్టపోయి...
నిఫ్టీ గత వారం తొలుత అప్‌ట్రెండ్‌ను కనబరిచి 24,500 స్థాయిని అధిగమించి మళ్లీ కరెక్షన్‌ను చవిచూసింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 450 పాయింట్లు (మైనస్ 1.87 శాతం) నష్టపోయి 23,900 వద్ద క్లోజైంది. గరిష్ఠ స్థాయిల వద్ద బలమైన రియాక్షన్‌ను చవిచూడటంతో రెండు వారాలుగా ఏర్పడిన ర్యాలీకి స్వల్పకాలికంగా బ్రేక్ పడింది. స్వల్పకాలానికి గాను నిఫ్టీకి 24,500 బలమైన కీలక నిరోధ స్థాయిగా మారింది. మరోవైపు మిడ్‌క్యాప్ ఇండె క్స్ కూడా ముందుగా 60,000 స్థాయిని అధిగమించి చివరకు 520 పాయింట్లు నష్టంతో ముగిసింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం 1 శాతం లాభంతో ఫ్లాట్‌గా క్లోజైంది. నిఫ్టీ ఈ వారం సానుకూలత కోసం పటిష్ఠతను సూచించాల్సి ఉంటుంది. నిఫ్టీ మరోసారి 24,000 వద్ద గట్టి పరీక్షను ఎదుర్కోనుంది. ఇక్కడ నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుంది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ సానుకూలత కోసం మైనర్ నిరోధ స్థాయిలైన 24,100 ఎగువన నిలదొక్కుకోవాలి. ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి ప్రధాన నిరోధ స్థాయిలు 24,300, 24,500. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం 24,500 ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది.
బేరిష్ స్థాయిలు: ఒకవేళ రియాక్షన్‌ను కనబరిస్తే 23,800 వద్ద మైనర్ మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేక పోతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 23,500 దిగువన ఉంటాయి. గత వారం ఈ స్థాయిల నుంచే రికవరీ కనబరిచింది. రక్షణ కోసం ఇక్కడ కచ్చితంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 475 పాయింట్లు నష్టపోయి 56,000 దిగువన క్లోజైంది. గత వారం గరిష్ఠ స్థాయిలైన 57,500 వద్ద బలమైన రియాక్షన్‌ను చవిచూసింది. ఈ వారం సానుకూలత కోసం 56,800 ఎగువన నిలదొక్కుకోవాలి. ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ప్రధాన నిరోధ స్థాయి 57,500. ఒకవేళ బలహీనతను కనబరిస్తే 55,600 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 55,000.
పాటర్న్: మార్కెట్ ప్రస్తుతం 50 రోజుల చలన సగటు వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొంటుంది. 24,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ ఎగువన ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. అలాగే 23,500 వద్ద ఏర్పడిన ‘‘కీలక సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం: 24,100, 24,300
మద్దతు : 23,800, 23,650
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..