Share News

టెక్‌ వ్యూ 24,000 వద్ద నిరోధం

ABN , Publish Date - May 25 , 2026 | 04:48 AM

నిఫ్టీ గత వారం సైడ్‌వేస్‌, జిగ్‌జాగ్‌ ట్రెండ్‌లో సాగుతూ చివరకు 75 పాయింట్ల (0.3ు) స్వల్ప లాభంతో 23,720 వద్ద క్లోజైంది. నిఫ్టీ గత వారం తొలుత 23,500 దిగువకు చేరి కనిష్ఠ స్థాయిల...

టెక్‌ వ్యూ 24,000 వద్ద నిరోధం

నిఫ్టీ గత వారం సైడ్‌వేస్‌, జిగ్‌జాగ్‌ ట్రెండ్‌లో సాగుతూ చివరకు 75 పాయింట్ల (0.3ు) స్వల్ప లాభంతో 23,720 వద్ద క్లోజైంది. నిఫ్టీ గత వారం తొలుత 23,500 దిగువకు చేరి కనిష్ఠ స్థాయిల వద్ద మద్దతు తీసుకుని 23,800-23,400 శ్రేణిలో కదలాడింది. గడచిన రెండు వారాలుగా నిఫ్టీ మద్దతు స్థాయిలైన 23,500 వద్ద నిలదొక్కుకుని సానుకూల కన్సాలిడేషన్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలతో ఈ వారం మార్కెట్‌ సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా స్వల్పకాలిక నిరోధ స్థాయిలైన 24,000 వద్ద మరోసారి పరీక్షను ఎదుర్కోవచ్చు. టెక్నికల్‌గా చూస్తే వచ్చే కొద్ది రోజులు ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకుంటేనే సానుకూల ట్రెండ్‌ను కొనసాగిస్తుందా లేదా అనేది తేలుతుంది. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ గతవారం ర్యాలీని కనబరిచి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలైన 62,000 వద్దకు చేరుకుంది. ఈ సూచీ మూడు వారాలుగా ఇక్కడ బలమైన నిరోధాన్ని ఎదుర్కొంటోంది. ఇక నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 73 పాయింట్ల స్వల లాభంతో క్లోజైంది.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ సానుకూలత కోసం ప్రస్తుత నిరోధ స్థాయిలైన 23,850 వద్ద నిలదొక్కుకోవాలి. ఇక్కడ నిలదొక్కుకుంటే 24,100 ఎగువన తదుపరి నిరోధ స్థాయిలుంటాయి. నాలుగు వారాలుగా ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేక విఫలమవుతూ వస్తోంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 24,500.

బేరిష్‌ స్థాయిలు: ఒకవేళ బలహీతను కనబరిస్తే 23,800 వద్ద మైనర్‌ మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేక పోతే బలహీనతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 23,650 దిగువన ఉంటాయి. తదుపరి ప్రధాన మానసిక, స్వల్పకాలిక మద్దతు స్థాయి 23,400.


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 345 పాయింట్ల (0.67 శాతం) స్వల్ప లాభంతో 54,055 వద్ద క్లోజైంది. పాజిటివ్‌ ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధ స్థాయిలైన 54,500 ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి స్వల్పకాలిక నిరోధ స్థాయి 55,100. ఇది రెండు వారాల క్రితం ఏర్పడిన గరిష్ఠ స్థాయి. సానుకూల ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. ఒకవేళ ఏదేనీ బలహీనతను సూచిస్తే ప్రస్తుత మైనర్‌ మద్దతు స్థాయిలైన 53,400 దిగువన నిలదొక్కుకోవాలి. బలహీనతను కనబరిస్తే 53,000 దిగువన మద్దతు స్థాయిలుంటాయి.

పాటర్న్‌: నిఫ్టీ ప్రస్తుతం 50 రోజుల చలన సగటు వద్ద కదలాడుతోంది. ఈ వారం సానుకూలత కోసం 24,000 ఎగువన నిలదొక్కుకోవాలి. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం కొద్ది రోజులు 24,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన నిరోధ ట్రెండ్‌లైన్‌’’ వద్ద బ్రేకౌట్‌ కావాల్సి ఉంటుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,000, 24,160

మద్దతు : 23,800, 23,650

వి. సుందర్‌ రాజా

ఇవి కూడా చదవండి..

అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..

ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే.

Updated Date - May 25 , 2026 | 04:48 AM