Share News

టెక్‌ వ్యూ 23,000 వద్ద నిలదొక్కుకుంటేనే..

ABN , Publish Date - Jun 08 , 2026 | 01:30 AM

నిఫ్టీ గత వారం బలహీనంగా ప్రారంభమై 23,150 స్థాయిలకు చేరుకుని మైనర్‌ రికవరీని కనబరిచింది. చివరి నాలుగు రోజులు సైడ్‌వేస్‌ ట్రెండ్‌లోనే సాగుతూ చివరకు 180 పాయింట్లు నష్టపోయి..

టెక్‌ వ్యూ  23,000 వద్ద నిలదొక్కుకుంటేనే..

నిఫ్టీ గత వారం బలహీనంగా ప్రారంభమై 23,150 స్థాయిలకు చేరుకుని మైనర్‌ రికవరీని కనబరిచింది. చివరి నాలుగు రోజులు సైడ్‌వేస్‌ ట్రెండ్‌లోనే సాగుతూ చివరకు 180 పాయింట్లు నష్టపోయి వీక్లీ కనిష్ఠ స్థాయి 23,366 వద్ద క్లోజైంది. నాలుగు వారాల అనంతరం 23,200 ఎగువన మైనర్‌ రికవరీ కనబరిచినప్పటికీ అనంతరం అక్కడ నిలదొక్కుకోలేక నాలుగు వారాల కనిష్ఠ స్థాయిలకు చేరువలో ముగిసింది. ఈ వారం నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయిలైన 23,000 వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌కు ముగింపు పలకాలంటే కొద్ది రోజులు ఈ స్థాయిల వద్ద కచ్చితంగా నిలదొక్కుకోవాలి. అప్పుడే ఈ స్థాయిల వద్ద బౌన్స్‌ బ్యాక్‌ అవుతుందా లేదా అనేది తేలుతుంది.

మరోవైపు గతవారం మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 970 పాయిం ట్లు నష్టపోయి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలైన 62,000 వద్ద రియాక్షన్‌ను చవిచూసింది. ర్యాలీకి స్వల్పకాలిక విరామం ఇచ్చినట్లు కనిపిస్తోంది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా ఫ్లాట్‌గా 18,100 స్థాయిల వద్ద ముగిసింది.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ సానుకూలత కోసం మైనర్‌ నిరోధ స్థాయిలైన 23,300 వద్ద నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 23,500. ఇది గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో ఏర్పడిన గరిష్ఠ స్థాయి. స్వల్పకాలిక పాజిటివ్‌ ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.

బేరిష్‌ స్థాయిలు: రక్షణ, సత్వర అప్‌ట్రెండ్‌ అవకాశాల కోసం ప్రధాన మద్దతు స్థాయిలైన 23,000 వద్ద కచ్చితంగా పటిష్ఠతను సూచించాల్సి ఉంటుంది. తదుపరి దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మద్దతు స్థాయిలు 22,750,22,500.


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం డౌన్‌ట్రెండ్‌ను కనబరిచినప్పటికీ చివరికి కోలుకుని 250 పాయింట్ల లాభంతో 54,500 వద్ద క్లోజైంది. ప్రస్తుతం ఈ సూచీ నాలుగు వారాల గరిష్ఠ స్థాయిలకు చేరువలో ఉంది. పాజిటివ్‌ ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధ స్థాయిలైన 55,100 ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 55,600. ఒకవేళ ఏదైనా బలహీనతను సూచిస్తే ప్రస్తుత మద్దతు స్థాయిలైన 53,900 వద్ద నిలదొక్కుకోవాలి. లేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి మద్దతు స్థాయిలు. 53,400, 53,000.

పాటర్న్‌: నిఫ్టీ ప్రస్తుతం కన్సాలిడేషన్‌, నిలకడ ప్యాట్రన్‌ను కనబరిచిన తర్వాతే తదుపరి ట్రెండ్‌ను కచ్చితంగా సూచించే అవకాశం ఉంది. 23,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవాలి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే డౌన్‌సైడ్‌ బ్రేకౌట్‌ను సూచిస్తుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 23,200, 23,310

మద్దతు : 23,000, 22,920

వి. సుందర్‌ రాజా

ఈ వార్తలనూ చదవండి:

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..

చిన్న కారుకు మళ్లీ ఆదరణ

Updated Date - Jun 08 , 2026 | 01:30 AM