Share News

ఐటీ షేర్లు మిలమిల

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:04 AM

భారత స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. ఏఐ విధ్వంస భయాలు తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి...

ఐటీ షేర్లు మిలమిల

  • సెన్సెక్స్‌ 382 పాయింట్ల పెరుగుదల

  • రూ.1.97 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. ఏఐ విధ్వంస భయాలు తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. దాంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం ఆరంభ నష్టాల నుంచి తేరుకుని మధ్యాహ్నం నుంచి లాభాల్లో పయనించాయి. ఇంట్రాడే కనిష్ఠ స్థాయి నుంచి 1,047 పాయింట్ల వరకు ఎగబాకిన సెన్సెక్స్‌.. చివరికి 382.50 పాయింట్ల లాభంతో 74,649.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100.95 పాయింట్ల వృద్ధితో 23,483.55 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.97 లక్షల కోట్లు పెరిగి రూ.462.67 లక్షల కోట్లకు (4.86 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.

టీసీఎస్‌ టాప్‌ గెయినర్‌: సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 20 రాణించగా.. టీసీఎస్‌ షేరు 6.53 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇన్ఫోసిస్‌ 5.66 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 4.08 శాతం, టెక్‌ మహీంద్రా 1.76 శాతం బలపడ్డాయి. ప్రస్తుత ఏఐ బూమ్‌ సంప్రదాయ ఐటీ సేవల కంపెనీలకు ముప్పునకు బదులు వ్యాపార అవకాశంగా మారనుందన్న ఆశావహం ఇందుకు దోహదపడింది.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 03 , 2026 | 01:04 AM