Share News

ఆచితూచి వ్యవహరించండి..!

ABN , Publish Date - May 25 , 2026 | 04:51 AM

భారత స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో చలించే అవకాశం ఉంది. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం కొలిక్కి వచ్చే అవకాశం ఉండటం, క్రూడాయిల్‌ ధరలు, అంతర్జాతీయంగా...

ఆచితూచి వ్యవహరించండి..!

భారత స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో చలించే అవకాశం ఉంది. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం కొలిక్కి వచ్చే అవకాశం ఉండటం, క్రూడాయిల్‌ ధరలు, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించే వీలుంది. ఒకవేళ పశ్చిమాసియా యుద్ధంపై స్పష్టత రాకపోతే మార్కెట్లలో అనిశ్చితి సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించటం మంచిది. ప్రస్తుతం ఫార్మా, హెల్త్‌కేర్‌, మెటల్స్‌ రంగ షేర్లు కొంత బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. నిఫ్టీ ఇండెక్స్‌ డౌన్‌ట్రెండ్‌లో ఉంది. నిఫ్టీ ఈ వారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగే అవకాశం ఉంది.

స్టాక్‌ రికమండేషన్స్‌

మ్యాక్స్‌ ఫైనాన్స్‌: జీవితకాల గరిష్ఠం తర్వాత దాదాపు 25 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం పుంజుకుని సైడ్‌వే్‌సలో చలిస్తోంది. ప్రస్తుతం 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకుని జోరును ప్రదర్శిస్తోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.1,680 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,650 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,800 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,620 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఆస్ట్రాల్‌: జీవితకాల గరిష్ఠం నుంచి 50 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ కౌంటర్‌ కొంత మేర పుంజుకుంది. చక్కని బేస్‌ ఏర్పడిన తర్వాత స్వల్పకాలిక బ్రేకౌట్‌తో దూకుడును ప్రదర్శించింది. ఆ తర్వాత డిమాండ్‌ లేకపోవటంతో 18 శాత మేర మళ్లీ డౌన్‌ అయ్యింది. తాజా ఆర్థిక ఫలితాల తర్వాత మళ్లీ అప్‌ట్రెండ్‌కు అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,541 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,500/1,530 శ్రేణిలో ప్రవేశించి రూ.1,700 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,470 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


దాల్మియా భారత్‌: గత ఏడాది గరిష్ఠ స్థాయి నుంచి ఈ షేరు 32 శాతం మేర క్షీణించింది. డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరుకు రూ.1,700 శ్రేణిలో మరోసారి మద్దతు లభించింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ క్రమంగా మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.1,795 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,750 శ్రేణిలో ఎంటరై రూ.2,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,720 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అదానీ టోటల్‌ గ్యాస్‌: రెండేళ్ల నుంచి పతనమవుతూ వస్తున్న ఈ కౌంటర్‌ ప్రస్తుతం కీలకమైన మద్దతు స్థాయికి చేరుకుంది. గ్యాస్‌ కొరత నేపథ్యంలో ఈ కంపెనీపై ఫోకస్‌ పెరిగింది. వాల్యూమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతున్నాయి. రెండు నెలల్లోనే 40 శాతం వరకు రిటర్న్‌ అందించింది. గత శుక్రవారం రూ.652 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.630 ఎగువన ప్రవేశించి రూ.755 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.610 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

టాటా ఎలెక్సీ: రెండున్నరేళ్లుగా ఈ షేరు పతనమవుతూ వస్తోంది. దాదాపు 65 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ఫలితాల నేపథ్యంలో స్వల్ప పుల్‌బ్యాక్‌కు ఆస్కారం కనిపిస్తోంది. నిఫ్టీతో పోల్చితే రిలేటివ్‌ స్ట్రెంత్‌ క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.4,311 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.4,300 శ్రేణిలో ప్రవేశించి రూ.4,550/4,650 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.4,240 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..

ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే.

Updated Date - May 25 , 2026 | 04:51 AM