Share News

ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టండి..!

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:59 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్‌, అమెరికా యుద్ధంపై ఒక స్పష్టత వచ్చే వరకు సూచీలపై అమ్మకాల ఒత్తిడి కొనసాగనుంది. హోర్ముజ్‌ జలసంధి...

ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టండి..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్‌, అమెరికా యుద్ధంపై ఒక స్పష్టత వచ్చే వరకు సూచీలపై అమ్మకాల ఒత్తిడి కొనసాగనుంది. హోర్ముజ్‌ జలసంధి దిగ్భంధంలో కొనసాగితే అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతిని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. చర్చలు సఫలమై శాంతి నెలకొనేంత వరకు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. అలాగే ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టాలి. అయితే కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుతం రియల్టీ, మెటల్‌, ఎనర్జీ, మీడియా, కమోడిటీస్‌, ఆటో, బ్యాంకింగ్‌ రంగ షేర్లు బలాన్ని ప్రదర్శిస్తున్నాయి.

స్టాక్‌ రికమండేషన్స్‌

జే ఎస్ డబ్ల్యూ ఇన్‌ఫ్రా: కొన్ని నెలలుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ వస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఈ కౌంటర్‌పై ఫోకస్‌ పెరిగింది. వాల్యూమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌, క్రమంగా పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబరు నుంచి ఏప్రిల్‌ తొలి వారం వరకు 33 శాతం దిద్దుబాటుకు లోనైన ఈ కౌంటర్‌ చివరి 12 సెషన్లలో 20 శాతం రాబడిని అందించింది. గత శుక్రవారం రూ.279 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.270 స్థాయిలో ప్రవేశించి రూ.330 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.260 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అదానీ టోటల్‌ గ్యాస్‌: రెండేళ్ల నుంచి పతనమవుతూ వస్తున్న ఈ షేరు ప్రస్తుతం కీలకమైన మద్దతు స్థాయికి చేరుకున్నాయి. గ్యాస్‌ కొరత నేపథ్యంలో ఈ కంపెనీపై ఫోకస్‌ పెరిగింది. నెల వ్యవధిలోనే 30 శాతం రిటర్నులు అందించింది. గత శుక్రవారం రూ.626 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.610 పై స్థాయిలో ప్రవేశించి రూ.730 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.590 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎస్‌బీఐ: జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు 21 శాతం మేర కరెక్షన్‌కు లోనైంది. మార్కెట్‌ ఒడుదొడుకులే ఇందుకు కారణం. మళ్లీ స్థిరత్వం వస్తుండటం, 200 రోజుల మూవింగ్‌ యావరేజెస్‌ వద్ద బౌన్స్‌ అవ్వటంతో ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. చివరి 17 సెషన్లలో 14 శాతం రాణించటం విశేషం. గత శుక్రవారం రూ.1,101 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,080 స్థాయిలో ప్రవేశించి రూ.1,250 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,060 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


బజాజ్‌ ఫైనాన్స్‌: జీవితకాల గరిష్ఠం తర్వాత ఈ కౌంటర్‌లో 30 శాతం మేర దిద్దుబాటు జరిగింది. కీలకమైన రూ.780 స్థాయి వద్ద మద్దతు తీసుకుని మళ్లీ అప్‌ట్రెండ్‌ బాటపట్టాయి. నిఫ్టీతో పోల్చితే మెరుగ్గా కనిపిస్తోంది. నెల రోజుల్లో 18 శాతం మేర రాబడిని అందించింది. గత శుక్రవారం రూ.921 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.900 ఎగువన ప్రవేశించి రూ.1,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.880 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

జిందాల్‌ స్టీల్‌: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ కౌంటర్‌ 70 శాతం రాబడి అందించింది. పైగా గరిష్ఠ స్థాయిల్లో చక్కని బేస్‌ ఏర్పరచుకుంది. మరోసారి జీవితకాల గరిష్ఠాన్ని బ్రేక్‌ చేసింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, వాల్యూమ్‌ గణనీయంగా పుంజుకున్నాయి. గత శుక్రవారం రూ.1,256 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,250 శ్రేణిలో ప్రవేశించి రూ.1,380 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,225 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

ఇవి కూడా చదవండి..

ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..

నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..

Updated Date - Apr 27 , 2026 | 01:59 AM