Share News

‘స్టాన్‌చార్ట్‌’లో 7,800 ఉద్యోగులు ఇంటికి..

ABN , Publish Date - May 20 , 2026 | 05:49 AM

అంతర్జాతీయ బ్యాంకుల్లోనూ ఉద్యోగాల కోత ప్రారంభమవుతోంది. ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకుల్లో ఒకటైన స్టాండర్డ్‌ చార్టర్డ్‌ 2030లోగా...

‘స్టాన్‌చార్ట్‌’లో 7,800 ఉద్యోగులు ఇంటికి..

భారత్‌, చైనాలపైనే ఎక్కువ ప్రభావం

లండన్‌: అంతర్జాతీయ బ్యాంకుల్లోనూ ఉద్యోగాల కోత ప్రారంభమవుతోంది. ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకుల్లో ఒకటైన స్టాండర్డ్‌ చార్టర్డ్‌ 2030లోగా దాదాపు 7,800 మంది బ్యాక్‌ ఆఫీస్‌ ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వీరిలో ఎక్కువ మంది చెన్నై, బెంగళూరు, చైనాలోని షెంజెన్‌, పోలెండ్‌ రాజధాని వార్సాల్లోని బ్యాక్‌ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులని భావిస్తున్నారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో వీరి సంఖ్య 15 శాతం వరకు ఉంటుందని బ్యాంక్‌ సీఈఓ బిల్‌ వింటర్స్‌ ప్రకటించారు. కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌ ద్వారా తక్కువ ఖర్చుతో మరింత సమర్ధవంతగా బ్యాక్‌ ఆఫీస్‌ పనులు నిర్వహించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే ఈ ఉద్యోగుల్లో ఎవరైనా పునఃశిక్షణతో కొత్త ఉద్యోగాల్లోకి మారాలనుకుంటే, వారికి ప్రాధాన్యత ఇస్తామని వింటర్స్‌ తెలిపారు.

‘మెటా’లోనూ 8,000 మంది ఔట్‌!

టెక్‌ కంపెనీ మెటా మరోసారి లేఆ్‌ఫలకు సిద్ధమైంది. ఈసారి దాదాపు 8,000 మంది ఉద్యోగులను సాగనంపుతుందని సమాచారం. బుధవారం ఉదయం 4 గంటలకు ఈ-మెయుల్స్‌ ద్వారా వీరికి ఈ సమాచారం అందించబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు అందరూ బుధవారం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని కోరింది. దీంతో ఎవరి మీద వేటు పడుతుందోనని ఉద్యోగులు భయపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి..

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన

పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

Updated Date - May 20 , 2026 | 05:49 AM