Share News

హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రచారకర్తగా శ్రీలీల

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:16 AM

హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రచారకర్తగా టాలీవుడ్‌ నటి శ్రీలీల ను నియమించుకున్నట్లు హెచ్‌ఎండీ ప్రకటించింది.

హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్స్‌   ప్రచారకర్తగా శ్రీలీల
Sreeleela

హైదరాబాద్‌: హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రచారకర్తగా టాలీవుడ్‌ నటి శ్రీలీల ను నియమించుకున్నట్లు హెచ్‌ఎండీ ప్రకటించింది. శ్రీలీల ప్రచారంతో సంస్థ స్థానం మరింత పటిష్ఠమవటంతో పాటు వినియోగదారులకు చేరువయ్యే అవకాశం లభించనుందని హెచ్‌ఎండీ ఇండియా వీపీ, సీఈఓ రవి కున్వార్‌ తెలిపారు. రానున్న పండగల సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌ ఫెస్టివ్‌ క్యాంపెయిన్స్‌ కోసం శ్రీలీల ప్రత్యేకంగా ప్రచారాన్ని చేపట్టనుందని తెలిపింది. భారత్‌లో హెచ్‌ఎండీ బ్రాండ్‌ కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న తరుణంలో సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేయటం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఈ సందర్భంగా శ్రీలీల అన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 01:16 AM