హైదరాబాద్‌లో స్ల్పాష్‌బీ జీసీసీ
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:07 AM
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ఏర్పాటు చేసింది. అమెరికాలోని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ఏర్పాటు చేసింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రం కేంద్రంగా పనిచేసే ఎంటర్‌ప్రైజ్ డేటా ఇంటలిజెన్స్ ప్లాట్‌ఫామ్ సంస్థ స్ల్పాష్‌బీ.. ఈ జీసీసీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ఈ కేంద్ర అభివృద్ధి, విస్తరణ కోసం 10 కోట్ల డాలర్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్టు స్ల్పాష్‌బీ తెలిపింది. దాదాపు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2014 నుంచి స్ల్పాష్‌బీ హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు