Share News

సదరన్‌ ట్రావెల్స్‌కు ‘వెటా’ అవార్డు

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:56 AM

స్థానిక సదరన్‌ ట్రావెల్స్‌ ప్రతిష్ఠాత్మకమైన ‘వెటా’ అవార్డుకు ఎంపికైంది. పర్యాటక రంగంలో కంపెనీ అందిస్తున్న వినూత్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది...

సదరన్‌ ట్రావెల్స్‌కు ‘వెటా’ అవార్డు

హైదరాబాద్‌: స్థానిక సదరన్‌ ట్రావెల్స్‌ ప్రతిష్ఠాత్మకమైన ‘వెటా’ అవార్డుకు ఎంపికైంది. పర్యాటక రంగంలో కంపెనీ అందిస్తున్న వినూత్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. సదరన్‌ ట్రావె ల్స్‌ వెటా అవార్డుకు ఎంపిక కావడం ఇది నాలుగో సారి. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీకి ఈ అవార్డు అందజేశారు. ట్రావెల్‌ రంగంలో తమ నిబద్ధతను ఈ అవార్డు మరింత బలపరుస్తుందని కంపెనీ ఎండీ ఆలపాటి కృష్ణ మోహన్‌ తెలిపారు. ఉద్యోగులు, ఎల్లపుడూ తమను వెన్నంటి ఉండే వినియోగదారులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో HOT పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..

ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు.. అందరూ చూస్తుండగా ఏం చేశాడంటే.

Updated Date - Feb 26 , 2026 | 05:56 AM