Share News

సదరన్‌ ట్రావెల్స్‌కు గ్లోబల్‌ టూరిజం అవార్డు

ABN , Publish Date - Aug 31 , 2026 | 02:33 AM

దేశంలోని ప్రముఖ ట్రావెల్‌ సంస్థల్లో ఒకటైన సదరన్‌ ట్రావెల్స్‌.. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్‌ టూరిజం అవార్డుల్లో...

సదరన్‌ ట్రావెల్స్‌కు గ్లోబల్‌ టూరిజం అవార్డు

హైదరాబాద్‌: దేశంలోని ప్రముఖ ట్రావెల్‌ సంస్థల్లో ఒకటైన సదరన్‌ ట్రావెల్స్‌.. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్‌ టూరిజం అవార్డుల్లో.. అత్యుత్తమ దేశీయ టూర్‌ ఆపరేటర్‌ అవార్డును దక్కించుకుంది. గ్లోబల్‌ టూరిజం నుంచి సదరన్‌ ట్రావెల్స్‌ ఈ అవార్డును అందుకోవటం ఇది రెండోసారి. పర్యాటక రంగ అభివృద్ధి, వినియోగదారులకు నాణ్యమైన సేవలందించటంతో పాటు వినూత్న ఆలోచనలకు గాను ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందని కంపెనీ పేర్కొంది. సదరన్‌ ట్రావెల్స్‌.. రెండోసారి గ్లోబల్‌ టూరిజం అవార్డును అందుకోవటం ఎంతో గర్వంగా ఉందని, ఎన్నో సంవత్సరాలుగా కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి ఇది గుర్తింపు అని సంస్థ ఎండీ కృష్ణ మోహన్‌ ఆలపాటి అన్నారు. 1970లో ఏర్పాటైన సదరన్‌ ట్రావెల్స్‌ ఇప్పటి వరకు 45 లక్షలకు పైగా వినియోగదారులకు సేవలందించింది.

ఇవి కూడా చదవండి..

బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..

పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..

Updated Date - Aug 31 , 2026 | 02:33 AM