Share News

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:56 AM

వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో...

 చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

న్యూఢిల్లీ: వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేనట్లయింది. ఈ రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు) వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు సుకన్య సమృద్ధి పథకంలో డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ రేటు, మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై 7.1 శాతం, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), పోస్టాఫీసు సేవింగ్స్‌ డిపాజిట్‌ పథకాలపై వడ్డీ రేటు వరుసగా 7.1 శాతం, 4 శాతం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి..

రెండో రోజూ నష్టాలే.. 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

Updated Date - Jul 01 , 2026 | 05:56 AM