Share News

స్కైరూట్‌ విక్రమ్‌-1 రేపే ప్రయోగం

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:28 AM

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ శనివారం మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్‌ స్టార్టప్‌ ‘స్కైరూట్‌’..

స్కైరూట్‌ విక్రమ్‌-1 రేపే ప్రయోగం

శ్రీహరికోటలో పూర్తయిన ఏర్పాట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ శనివారం మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్‌ స్టార్టప్‌ ‘స్కైరూట్‌’.. తన తొలి రాకెట్‌ విక్రమ్‌-1ను ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా నాలుగు చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. స్కైరూట్‌ ఈ రాకెట్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి అభివృద్ధి చేసింది. శనివారం ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు స్కైరూట్‌ ఏరోస్పేస్‌ తెలిపింది. ‘ది మిషన్‌ ఆగమన్‌’ పేరుతో జరిగే విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగాత్మక పరీక్షలో స్కైరూట్‌ ఏరోస్పే్‌సనకు చెందిన చిన్న ఉపగ్రహం ‘స్కోప్‌’తో పాటు గ్రహ స్పేస్‌, కాస్మోసర్వ్‌, డిక్యూబ్డ్‌ కంపెనీల ఉపగ్రహాలు, కాస్మోస్‌ డైమండ్‌ ఆర్ట్‌వర్క్‌ ‘కాస్మిక్‌ బ్లూమ్‌’ కూడా అంతరిక్షంలోకి ప్రయాణించనున్నాయి.

తొలి ప్రైవేట్‌ రాకెట్‌

శ్రీహరికోట నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉపగ్రహ ప్రయోగాలన్నీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రాకెట్ల ద్వారానే జరిగాయి. ఇప్పుడు స్కైరూట్‌ ఆ చరిత్రను తిరగ రాసి, తొలి దేశీయ ప్రైవేట్‌ కంపెనీగా చరిత్ర సృష్టించబోతోంది. ఈ ప్రయోగం కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు స్కైరూట్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్‌ కుమార్‌ చందన తెలిపారు. 2022 నవంబరు 18న స్కైరూట్‌.. విక్రమ్‌ ఎస్‌ అనే రాకెట్‌ ద్వారా ఒక చిన్న పరికరాన్ని విజయవంతంగా సబ్‌ ఆర్బిటల్‌ కక్ష్యలోకి పంపించింది. విక్రమ్‌ రాకెట్‌ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా 350 కిలోల వరకు బరువు ఉండే ఉపగ్రహాలను లో ఎర్త్‌ ఆర్బిట్‌ (ఎల్‌ఈఓ) లోకి పంపాలని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ భావిస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 05:28 AM