రోల్స్ రాయిస్‌తో సిగ్మా అడ్వాన్స్‌డ్ రూ.3,800 కోట్ల డీల్
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:02 AM
ఏరోస్పేస్ సిస్టమ్స్ తయారీ, సరఫరా నిమిత్తం రోల్స్-రాయి్‌సతో హైదరాబాద్ కు చెందిన సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఏరోస్పేస్ సిస్టమ్స్ తయారీ, సరఫరా నిమిత్తం రోల్స్-రాయి్‌సతో హైదరాబాద్ కు చెందిన సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఏడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.3,800 కోట్లు అని సోమవారం కంపెనీ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యంత కచ్చితత్వంతో కూడిన, భద్రతకు కీలకమైన విడిభాగాలు, అసెంబ్లీలను రోల్స్-రాయిస్ ఏరోస్పేస్ ప్రోగ్రామ్‌లకు సిగ్మా అడ్వాన్స్‌డ్ సరఫరా చేయనుంది. ఈ సందర్భంగా సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ కలిదిండి మాట్లాడుతూ.. తమ వ్యూహం ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో రోల్స్-రాయి్‌సతో కుదిరిన ఒప్పందం ప్రతిబింబిస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం