Share News

దాతృత్వంలో శివ్‌ నాడార్‌దే అగ్రస్థానం

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:30 AM

రెండు చేతులా సంపాదించడమే కాదు. అందులో కొంత భాగా న్ని దాతృత్వ కార్యకలాపాలకు వెచ్చించేందుకు పారిశ్రామిక దిగ్గజాలు...

దాతృత్వంలో శివ్‌ నాడార్‌దే అగ్రస్థానం

రోజుకు సగటున రూ.7.1 కోట్ల దానధర్మాలు

న్యూఢిల్లీ: రెండు చేతులా సంపాదించడమే కాదు. అందులో కొంత భాగా న్ని దాతృత్వ కార్యకలాపాలకు వెచ్చించేందుకు పారిశ్రామిక దిగ్గజాలు ఇష్టపడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26) 219 మంది భారత పారిశ్రామికవేత్తలు దాతృత్వ కార్యకలాపాల కోసం రూ.11,554 కోట్లు ఖర్చు చేసినట్టు తాజాగా విడుదలైన ‘ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రఫీ జాబితా 2026 తెలిపింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌, ఆయన కుటుంబం ఈ విషయంలో అందరి కంటే ముందుంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) నాడార్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రోజుకు సగటున రూ.7.1 కోట్ల చొప్పున రూ.2,593 కోట్లు దాన ధర్మాల కోసం ఖర్చు చేసి వరుసగా ఐదో ఏటా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో దాదాపు 93 శాతం నిధులను నాడార్‌ తన వ్యక్తిగత సంపద నుంచి దానం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువ.


నాడార్‌ కుటుంబం తర్వాత రూ.877 కోట్లతో గౌతమ్‌ అదానీ కుటుంబం, రూ.632 కోట్లతో బజాజ్‌ కుటుంబం, రూ.620 కోట్లతో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబాలు దాన ధర్మాల్లో ముందున్నాయి. అలాగే నందన్‌ నీలేకని రూ.380 కోట్లు, సైరస్‌ పూనావాలా, అధర్‌ పూనావాలా కుటుంబం రూ.336 కోట్లు, సుధీర్‌ మెహతా, సమీర్‌ మెహతా రూ.334 కోట్లు, రంజన్‌ పాయ్‌, అతని కుటుంబం రూ.219 కోట్లు, రోహిణి నీలేకని రూ.215 కోట్లు, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా రూ.93 కోట్లు దాతృత్వ కార్యకలాపాల కోసం వెచ్చించారు.

జాబితాలో తెలుగు ప్రముఖులు

పేరు విరాళం (రూ.కోట్లలో) కంపెనీ/ఫౌండేషన్‌

మురళీ కె దివీ 30 దివీస్‌ లేబొరెటరీస్‌

బి పార్థసారథి రెడ్డి 27 హెటెరో ల్యాబ్స్‌

పి పిచ్చిరెడ్డి 24 ఎంఈఐఎల్‌ ఫౌండేషన్‌

పీవీ కృష్ణారెడ్డి 23 ఎంఈఐఎల్‌ ఫౌండేషన్‌

కె సతీష్‌ రెడ్డి 15 డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరెటరీస్‌

జీవీ ప్రసాద్‌ 15 డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌

పీవీ రాంప్రసాద్‌ రెడ్డి 12 అరబిందో ఫార్మా ఫౌండేషన్‌

మహిమా దాట్ల 10 బయోలాజికల్‌ ఈ

రామేశ్వర రావు జూపల్లి 7 మై హోం పారిశ్రామ

ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 05:30 AM