సెన్సెక్స్ 790 పాయింట్లు అప్
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:39 AM
చమురు సెగ తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం బాగా కోలుకుంది. సెన్సెక్స్ 790.54 పాయింట్ల లాభంతో...
ముంబై: చమురు సెగ తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం బాగా కోలుకుంది. సెన్సెక్స్ 790.54 పాయింట్ల లాభంతో 76,991.22 వద్ద, నిఫ్టీ 50 సూచీ 197.55 పాయింట్ల లాభంతో 24021.65 వద్ద ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్లు ప్రామాణిక సూచీలను లాభాలవైపు నడిపించాయి.
నాలుగు నెలల కనిష్ఠానికి చమురు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పతనం కొనసాగుతోంది. బుధవారం పీపా బ్రెంట్ రకం ముడి చమురు ధర 3.01 శాతం నష్టపోయి 74.76 డాలర్లకు చేరింది. అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ రకం పీపా ముడి చమురు ఽధర కూడా 2.96 శాతం నష్టపోయి 71.04 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత నాలుగు నెలల్లో ముడి చమురు ఽధర ఇంత కనిష్ఠ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి..
నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు
భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు.