సోషల్ ఇంపాక్ట్ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.1,000
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:55 AM
ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్) నిర్వహణలోని సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్‌లో (ఎస్‌ఐఎఫ్) రిటైల్ మదుపరుల పెట్టుబడులకు సంబంధించి సెబీ కీలక నిర్ణయం...
రిటైల్ మదుపరుల ఆకర్షణకు సెబీ చర్య
న్యూఢిల్లీ : ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్) నిర్వహణలోని సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్‌లో (ఎస్‌ఐఎఫ్) రిటైల్ మదుపరుల పెట్టుబడులకు సంబంధించి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ స్టాక్ ఎక్స్చేంజిలో (ఎస్‌ఎ్‌సఈ) నమోదైన లాభాపేక్షలేని సంస్థలు (ఎన్‌పీఓ) జారీ చేసే ఈ ఫండ్స్‌లో రిటైల్ మదుపరుల ప్రవేశాన్ని మరింత విస్తృతం చేసింది. ఇందుకోసం ఈ ఫండ్స్‌లో రిటైల్ మదుపరుల కనీస పెట్టుబడి మొత్తాన్ని ప్రస్తుత రూ.2 లక్షల నుంచి రూ.1,000లకు కుదించింది. ఎస్‌ఎ్‌సఈలో లిస్టయిన ఎన్‌పీఓల ఎస్‌ఐఎ్‌ఫలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎన్‌పీఓలు జారీ చేసే జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ పెట్టుబడి సాధనాల్లో సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ సబ్‌స్ర్కిప్షన్ మొత్తాన్ని సెబీ ఇప్పటికే 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది. ఇందుకు అనుగుణంగానే ఈ ఫండ్స్‌లో రిటైల్ మదుపరుల కనీస పెట్టుబడిని రూ.2 లక్షల నుంచి రూ.1,000కు తగ్గించినట్టు భావిస్తున్నారు.
సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ అంటే?
ఎన్‌పీఓలు కొన్ని సామాజిక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ (ఎస్‌ఐఎఫ్) ద్వారా నిధులు సేకరిస్తాయి. ఇందుకోసం అవి జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ పేరుతో కొన్ని పత్రాలు జారీ చేస్తాయి. వీటిపై మదుపరులకు ఎలాంటి వడ్డీ చెల్లింపులుగానీ, అసలు తిరిగి చెల్లింపుగానీ ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు ఎస్‌ఐఎ్‌ఫల ద్వారా ఎన్‌పీఓలకు ఇచ్చే విరాళాలు (డొనేషన్లు) అనుకోవచ్చు. కాకపోతే ఈ ఎన్‌పీఓలు ఎస్‌ఎ్‌సఈలో నమోదు లేదా లిస్టయి ఉండాలని సెబీ స్పష్టం చేసింది.
ఇతర ప్రధాన మార్పులు
కాల పరిమితి ముగిసిన ఏఐఎ్‌ఫల్లో ఎలాంటి నిఽధులు మిగలకపోయినా కొన్ని నిబంధనలకు లోబడి ఆ ఫండ్స్‌కు మూడేళ్ల వరకు ‘నిద్రాణ’ స్టేటస్.
ఎలాంటి నిధులు సమీకరించకపోయినా, ఎన్‌పీఓలు మూడేళ్ల వరకు ఎస్‌ఎ్‌సఈలో నమోదు కొనసాగించే వెసులుబాటు.
రీట్స్, ఇన్విట్స్ నిబంధనలు సైతం సవరించిన సెబీ.
Also Read:
ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
For More Latest News