ఐపీఓల జారీకి మరింత గడువు
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:33 AM
సెబీ క్లియరెన్స్ పూర్తయి ఐపీఓలకు సిద్ధంగా ఉన్న కంపెనీలకు సెబీ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు నెలాఖరులోపు...
న్యూఢిల్లీ: సెబీ క్లియరెన్స్ పూర్తయి ఐపీఓలకు సిద్ధంగా ఉన్న కంపెనీలకు సెబీ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు నెలాఖరులోపు ఐపీఓలు జారీ చేయాల్సిన కంపెనీలు సెప్టెంబరు 30 వరకు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రస్తుత అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లిస్టెడ్ కంపెనీలు తమ ఈక్విటీలో కనీసం 25ు షేర్లను పబ్లిక్‌కు జారీ చేయాలన్న నిబంధనల అమలు కూడా వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..