దీర్ఘకాలిక మూలధనమే మనకు ఇంధనం
ABN , Publish Date - May 05 , 2026 | 06:00 AM
భారత్‌కు దీర్ఘకాలిక మూలధనం అవసరమని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. అది కూడా మార్కెట్ ఆధారిత నిధులై...
మార్కెట్ ఆధారిత నిధులై ఉండాలి
కమోడిటీ డెరివేటివ్స్‌పై నియంత్రణకు
బ్యాంకులు, బీమా కంపెనీలకు నో
ముంబై: భారత్‌కు దీర్ఘకాలిక మూలధనం అవసరమని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. అది కూడా మార్కెట్ ఆధారిత నిధులై ఉండాలని స్పష్టం చేశారు. అలా అయితేనే అది మన ఆర్థిక వ్యవస్థకు ఇంధనంలా పనిచేస్తుందన్నారు. ఐఎంసీ క్యాపిటల్ మార్కెట్ సదస్సుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. పెట్టుబడుల సమీకరణలో రుణ పత్రాల మార్కెట్.. ఈక్విటీ మార్కెట్‌కు చోదకశక్తిగా మారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కంపెనీలకు అవసరమైన దీర్ఘకాలిక నిధులు సమకూర్చేలా ఉండాలని పాండే కోరారు. పెట్టుబడుల ఎంపికలోనూ మదుపరులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలన్నారు. మార్కెట్ అభివృద్ధి, మదుపరుల రక్షణ రెండూ కలిసికట్టుగా ఉండాలని స్పష్టం చేశారు. ‘నష్టభయాన్ని నియంత్రిస్తూనే మార్కెట్‌కు సంబంధించి అన్ని విభాగాలను అభివృద్ధి చేయాలన్నది మా అభిమతం’ అన్నారు.
ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ సుముఖంగా లేవు
బ్యాంకులు, బీమా సంస్థలు కమోడిటీ డెరివేటివ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించడంపైనా సెబీ చీఫ్ పాండే స్పష్టత ఇచ్చారు. బ్యాంకులను నియంత్రించే ఆర్‌బీఐ కానీ, బీమా కంపెనీలను నియంత్రించే ఐఆర్‌డీఏఐ కానీ ఇందుకు ఏ మాత్రం సముఖంగా లేవన్నారు. ఇందుకు కొన్ని సముచిత కారణాలు కూడా ఉన్నట్టు తెలిపారు. పెన్షన్ పథకాలు.. కమోడిటీ డెరివేటివ్స్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని అనుమతించే విషయన్ని పీఎ్‌ఫఆర్‌డీఏ పరిశీలిస్తోందని పాండే వెల్లడించారు. అయితే దీనిపై పీఎ్‌ఫఆర్‌డీఏ నిర్ణయం ఇప్పటికే తీసుకుందా? లేదా? అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఆంథ్రోపిక్ మైథో్‌సతో పాటు ఇతర కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్‌తో మార్కెట్‌కు పొంచి ఉన్న ముప్పుపైనా పాండే మాట్లాడుతూ.. దీనిపై త్వరలోనే మార్కెట్ వర్గాల అవగాహన కోసం కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు.
ఈ వార్తలూ చదవండి:
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ జోరు.. సన్ టీవీ షేర్లు పతనం..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..