ఏఐ వినియోగంపై త్వరలో మార్గదర్శకాలు
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:16 AM
క్యాపిటల్ మార్కెట్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్...
సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ఈ మార్గదర్శకాలు ప్రధానంగా మదుపరుల ప్రయోజనాలపై దృష్టి పెట్టేలా ఉంటాయన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు. క్యాపిటల్ మార్కెట్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) టూల్స్ వినియోగం, వాటి దుర్వినియోగాల నుంచి మదుపరులకు రక్షణ కల్పించడానికి సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలపై సెబీ గత ఏడాది జూన్‌లోనే ఒక చర్చాపత్రం విడుదల చేసింది. మార్కెట్ వర్గా ల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను క్రోడీకరించి పటిష్ఠమైన నియంత్రణలకు దారి తీసేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేయబోతోంది. ఈ మార్గదర్శకాలు ఏఐ, మెషిన్ లెర్నిం గ్ టూల్స్ వినియోగించే సెక్యూరిటీస్ మార్కెట్ సంస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెంచేలా ఉంటాయని పాండే చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ మృతి!