ప్రపంచ పరిశోధనల కేంద్రంగా భారత్..
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:44 AM
ప్రపంచ పరిశోధనల కేంద్రం గా ఎదగాలన్న మన దేశ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుత అంచెలంచెల పురోగతి విధానం ఏ మాత్రం పనికి రాదని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు...
భారీ ఆవిష్కరణలతోనే సాధ్యం
డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి
న్యూఢిల్లీ: ప్రపంచ పరిశోధనల కేంద్రం గా ఎదగాలన్న మన దేశ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుత అంచెలంచెల పురోగతి విధానం ఏ మాత్రం పనికి రాదని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. భారీ నవకల్పనలు, ఆవిష్కరణలతోనే ఈ లక్ష్యం నెరవేరుతుందన్నారు. శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు రోగులకు ఉపయోగపడాలంటే అవి ఆచరణీయంగా ఉండాలన్నారు. ‘ఆచరణీయ పరిశోధనా వ్యవస్థ, భారత్ కోసం ప్రపంచం నేర్పుతున్న పాఠాలు’ అనే పేరుతో కంపెనీ విడుదల చేసిన శ్వేత పత్రంలో సతీశ్ రెడ్డి ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
మనకు సత్తా ఉంది: ప్రపంచ వైద్య రంగ రూపురేఖలను మార్చే సత్తా మన దేశానికి ఉందని సతీష్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆధునిక బయోమెడికల్ ఆవిష్కరణల్లో ఆచరణాత్మక శాస్త్రీయ పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దీని వల్ల శాస్త్రీయ ఆవిష్కరణలు-అమలు మధ్య వ్యత్యాసం కూడా తగ్గిపోతోందన్నారు.
ఇవి కూడా చదవండి..
నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు
భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు