సనోఫీ హైదరాబాద్ జీసీసీ విస్తరణ
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:22 AM
సనోఫీ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐపీఎల్).. హైదరాబాద్‌లోని తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను మరింతగా విస్తరించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సనోఫీ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐపీఎల్).. హైదరాబాద్‌లోని తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను మరింతగా విస్తరించింది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ప్రస్తుతం హైటెక్‌సిటీలో ఉన్న క్యాంప్‌సలో అదనంగా 2.7 లక్షల చదరపు మీటర్ల వర్క్ స్పేస్‌ను చేర్చుకున్నట్లు సనోఫీ వెల్లడించింది. ఈ విస్తరణతో జీసీసీ ఉద్యోగుల సంఖ్య 2,600 నుంచి 4,500 పెరగనుందని తెలిపింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ విస్తరణతో ఆర్ అండ్ డీ, ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్‌లో భారత్ స్థానా న్ని హైదరాబాద్ జీసీసీ మరింత పటిష్ఠం చేయనుందని సనోఫీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మెడలైన్ రోచ్ అన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ సర్వీసుల్లో ఈ సెంటర్ కీలకంగా మారనుందని తెలిపారు. 2019లో సనోఫీ హైదరాబాద్‌లో మెడికల్ సర్వీసుల కోసం ఈ జీసీసీని ప్రారంభించింది. అనంతరం 2024లో ఈ జీసీసీని మరింతగా విస్తరించింది.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..