Share News

24 నుంచి సాయి పేరెంటరల్స్‌ ఐపీఓ

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:11 AM

ఔషధ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ సాయి పేరెంటరల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 24న ప్రారంభమై.. 27న ముగియనుంది...

24 నుంచి సాయి పేరెంటరల్స్‌ ఐపీఓ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఔషధ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ సాయి పేరెంటరల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 24న ప్రారంభమై.. 27న ముగియనుంది. ఇష్యూలో భాగంగా షేర్ల ధరల శ్రేణిని రూ.372-392గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఐపీఓలో భాగంగా రూ.285 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన 31,57,880 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన విక్రయించనున్నట్లు సంస్థ సీఎండీ అనిల్‌ కేకే తెలిపారు. కంపెనీ తన షేర్లను బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలో నమోదు చేయనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

మరణించిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఎందుకు చెప్పరు

మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 18 , 2026 | 02:11 AM