సాయి పేరెంటరల్స్ చేతికి బియాన్ థెరప్యూటిక్స్
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:30 AM
హైదరాబాద్‌కు చెందిన బ్రాండెడ్ ఫార్ములేషన్స్ ప్రిస్కిప్షన్ వ్యాపార సంస్థ బియాన్ థెరప్యూటిక్స్‌లో మెజారిటీ వాటాను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన బ్రాండెడ్ ఫార్ములేషన్స్ ప్రిస్కిప్షన్ వ్యాపార సంస్థ బియాన్ థెరప్యూటిక్స్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ వెల్లడించింది. అనుబంధ సంస్థ ఎస్‌పీ అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ కొనుగోలు చేపట్టినట్లు తెలిపింది. అయితే బియాన్‌లో ఎంత వాటా కొనుగోలు చేసిందనే వివరాలతో పాటు ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించిందనే విషయాలను మాత్రం సాయి పేరెంటరల్స్ వెల్లడించలేదు. పూర్తిగా నగదు రూపంలో ఉండనున్న ఈ లావాదేవీ నెలాఖరు కల్లా పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్‌తో బియాన్.. సాయి పేరెంటరల్స్ అనుబంధ సంస్థగా ఉండనుందని పేర్కొంది. 2005లో ప్రారంభమైన బియాన్.. మొత్తం 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కంపెనీ పోర్టుఫోలియోలో న్యూరోపతి, డయాబెటిస్, పెయిన్ మేనేజ్‌మెంట్ ఔషధాలు సహా పలు థెరప్యూటిక్స్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..