Share News

రూ.90 లక్షల కోట్లు.. తగ్గుతున్న ఎఫ్‌పీఐల వాటా

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:57 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) పట్టు తగ్గుతోంది. ఇదే సమయంలో దేశీయ మదుపరులు క్రమంగా పట్టు బిగిస్తున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం, భూముల కొనుగోళ్లు...

రూ.90 లక్షల కోట్లు.. తగ్గుతున్న ఎఫ్‌పీఐల వాటా

స్టాక్‌ మార్కెట్లో వ్యక్తిగత మదుపరుల పెట్టుబడులు ఇవి

సెప్టెంబరు నాటికి రికార్డు స్థాయిలో 19.5 శాతానికి చేరిక

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) పట్టు తగ్గుతోంది. ఇదే సమయంలో దేశీయ మదుపరులు క్రమంగా పట్టు బిగిస్తున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం, భూముల కొనుగోళ్లు పక్కన పెట్టి స్టాక్‌ మార్కెట్లో మదుపు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) లిస్టెడ్‌ కంపెనీల ఈక్విటీలో ఎఫ్‌పీఐల వాటా 21 ఏళ్ల కనిష్ఠ స్థాయి 14.7 శాతానికి పడిపోయింది. ఈ కంపెనీల ఈక్విటీలో ఎఫ్‌పీఐల వాటా తగ్గడం వరుసగా ఇది ఎనిమిదో త్రైమాసికమని ఎన్‌ఎ్‌సఈ విడుదల చేసిన ‘ఇండియా ఓనర్‌షిప్‌ ట్రాకర్‌’ నివేదిక తెలిపింది. దీంతో రెండు దశాబ్దాలుగా భారత మార్కెట్‌పై ఎఫ్‌పీఐలు సాగిస్తున్న గుత్తాధిపత్యానికి క్రమంగా తెరపడుతోంది.

వ్యక్తిగత మదుపరుల హవా: ఇదే సమయంలో మార్కెట్లలో ప్రమోటర్లు గాక వ్యక్తిగత దేశీయ మదుపరుల పెట్టుబడుల వాటా క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఎన్‌ఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల ఈక్విటీలో వీరి వాటా రికార్డు స్థాయిలో 19.5 శాతానికి చేరింది. దీని విలువ రూ.90.4 లక్షల కోట్ల వరకు ఉంటుందని నివేదిక వెల్లడించింది. వ్యక్తిగత మదుపరులు.. మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) ద్వారా పరోక్షంగా కంపెనీల షేర్లలో చేసిన రూ.44.6 లక్షల కోట్ల పెట్టుబడుల విలువను కూడా కలిపి ఈ వాటాను లెక్కించారు. ఎంఎ్‌ఫల ద్వారా చేసిన పెట్టుబడులను పక్కన పెడితే ఎన్‌ఎ్‌సఈ లిస్టె డ్‌ కంపెనీల ఈక్విటీలో కేవలం వ్యక్తిగత మదుపరుల పెట్టుబడుల వాటానే 9.6 శాతం వరకు ఉంది. 2024 డిసెంబరులో నమోదైన 9.8 శాతం వాటాతో పోలిస్తే ఇది కేవలం 0.2 శాతం మాత్రమే తక్కువ. ఇదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల ఈక్విటీలో ప్రమోటర్ల వాటా 50.4 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ వ్యక్తిగత మదుపరులు గత ఆరు త్రైమాసికాల్లో ఎన్నడూ లేని విధంగా రూ.42,700 కోట్ల విలువైన ఎన్‌ఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల షేర్లను కొనుగోలు చేసినట్టు తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

Updated Date - Nov 11 , 2026 | 05:57 AM