Share News

మళ్లీ మార్కెట్లోకి రెనో డస్టర్‌

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:13 AM

ఫ్రెంచి కార్ల దిగ్గజం రెనో.. మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ డస్టర్‌ను సరికొత్త ముస్తాబులతో మార్కెట్లో తిరిగి ప్రవేశపెట్టింది. ఢిల్లీలో కారు ప్రారంభ ధర రూ.10.49 లక్షలు...

మళ్లీ మార్కెట్లోకి రెనో డస్టర్‌

న్యూఢిల్లీ: ఫ్రెంచి కార్ల దిగ్గజం రెనో.. మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ డస్టర్‌ను సరికొత్త ముస్తాబులతో మార్కెట్లో తిరిగి ప్రవేశపెట్టింది. ఢిల్లీలో కారు ప్రారంభ ధర రూ.10.49 లక్షలు. ప్రస్తుతం కంపెనీ పోర్టుఫోలియోలో క్విడ్‌, ట్రైబర్‌, కైగర్‌ ఉన్నాయి. మారుతి గ్రాండ్‌ విటారా, కియా సెల్టోస్‌, హ్యుండయ్‌ క్రెటా, టాటా సియెర్రాలకు డస్టర్‌ గట్టి పోటీనిస్తుందని అంచనా. ఈ కారు తయారీలో పూర్తిగా 90 శాతానికి పైబడి స్థానికంగా తయారైన విడిభాగాలే వినియోగించినట్టు కంపెనీ తెలిపింది. ఆరు గేర్లతో ఆటోమేటిక్‌, మాన్యువల్‌ వెర్షన్లు రెండింటిలోనూ ఈ కారు అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..

మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 18 , 2026 | 02:13 AM