జామ్‌నగర్‌లో భారీ డేటా సెంటర్
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:42 AM
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), సోషల్ మీడియా...
ఆర్‌ఐఎల్, మెటా భాగస్వామ్యంలో ఏర్పాటు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), సోషల్ మీడియా దిగ్గజం మెటా వ్యూహాత్మక భాగస్వామాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం కింద గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 168 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్‌ను ఇరు సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. మెటా ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా భారత్‌లో నిర్మించనున్న తొలి బిల్ట్-టు-సూట్ డేటా సెంటర్ ఇదే కావడం విశేషం. కాగా ఒప్పందం ప్రకారం డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ, విద్యుత్ సరఫరా, నెట్‌వర్క్ కనెక్టివిటీ, యుటిలిటీ సేవలు, ఆపరేషనల్ సర్వీసులు వంటి తదితర బాధ్యతలను రిలయన్స్ చేపట్టనుంది. ఈ సెంటర్‌లోని కంప్యూటింగ్ సామర్థ్యాన్ని దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన మెటా వినియోగించుకోనుంది. తమ గ్లోబల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఏఐ అప్లికేషన్లు వంటి తదితర డేటా ప్రాసెసింగ్ అవసరాల కోసం మెటా ఈ సదుపాయాలను ఉపయోగించనుంది.
ఇవి కూడా చదవండి..
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..