Share News

సీబీఎం బ్లాకుల కోసం రిలయన్స్‌ ఎస్సార్‌ బిడ్స్‌

ABN , Publish Date - Apr 21 , 2026 | 06:40 AM

తెలంగాణ సహా దేశంలోని పలు చోట్ల కోల్‌ బెడ్‌ మిథేన్‌ (సీబీఎం) బ్లాక్‌ల కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్సార్‌ గ్రూప్‌ పోటీ పడుతున్నాయి. గత నెల 5వ తేదీన ముగిసిన బిడ్డింగ్‌లో...

సీబీఎం బ్లాకుల కోసం రిలయన్స్‌ ఎస్సార్‌ బిడ్స్‌

న్యూఢిల్లీ: తెలంగాణ సహా దేశంలోని పలు చోట్ల కోల్‌ బెడ్‌ మిథేన్‌ (సీబీఎం) బ్లాక్‌ల కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్సార్‌ గ్రూప్‌ పోటీ పడుతున్నాయి. గత నెల 5వ తేదీన ముగిసిన బిడ్డింగ్‌లో ఈ రెండు సంస్థలే అత్యధిక బిడ్స్‌ వేశాయి. రెండు విడతలుగా మొత్తం 16 బ్లాకుల్లో సీబీఎం అన్వేషణ, ఉత్పత్తి కోసం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రభుత్వం బిడ్స్‌ ఆహ్వానించింది. ఈ 16 బ్లాకుల్లో చెరో మూడింటిలో సీబీఎం అన్వేషణ, ఉత్పత్తి కోసం రిలయన్స్‌, ఎస్సార్‌ గ్రూప్‌లు బిడ్స్‌ వేశాయి. ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ ఇండియా కూడా మూడు బ్లాకుల కోసం బిడ్స్‌ వేసింది. అయితే మరో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ మాత్రం ఈ బిడ్డింగ్‌కు దూరంగా ఉంది. ఒడిసా, చత్తీ్‌సగఢ్‌లోని రెండు బ్లాకుల కోసం రిలయన్స్‌ మాత్రమే బిడ్‌ దాఖలు చేసింది. అయితే తెలంగాణలోని గోదావరి వ్యాలీ కోల్‌ ఫీల్డ్‌లోని పీజీ-ఓఎన్‌హెచ్‌పీ (సీబీఎం) 2026/5 బ్లాక్‌ కోసం మాత్రం రిలయన్స్‌, ఎస్సార్‌ గ్రూప్‌ రెండింటి నుంచి బిడ్స్‌ వచ్చినట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) తెలిపింది.

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 06:40 AM