ప్లాస్టో నుంచి అడ్వాన్స్‌డ్ సెల్ఫ్ క్లీనింగ్ వాటర్ ట్యాంక్
ABN , Publish Date - Jul 07 , 2026 | 02:01 AM
ఆర్‌సీ ప్లాస్టో అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్.. మార్కెట్లోకి అడ్వాన్స్‌డ్ సెల్ఫ్ క్లీనింగ్ వాటర్ ట్యాంక్‌ను తీసుకువచ్చింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, నీటిని...
హైదరాబాద్: ఆర్‌సీ ప్లాస్టో అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్.. మార్కెట్లోకి అడ్వాన్స్‌డ్ సెల్ఫ్ క్లీనింగ్ వాటర్ ట్యాంక్‌ను తీసుకువచ్చింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, నీటిని పరిశుభ్రంగా ఉంచేలా కొత్త టెక్నాలజీతో ఈ ట్యాంక్‌ను రూపొందించినట్లు తెలిపింది. అంతేకాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్యాంక్‌ను శుభ్రం చేసుకునేలా ట్యాంక్‌ను డిజైన్ చేసినట్లు ఆర్‌సీ ప్లాస్టో వెల్లడించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు తట్టుకోవటంతో పాటు యూవీ స్టెబిలైజ్డ్ ప్రొటెక్షన్‌తో దీన్ని తీసుకువచ్చినట్లు తెలిపింది. ఈ అడ్వాన్స్‌డ్ సెల్ఫ్ క్లీనింగ్ వాటర్ ట్యాంక్‌ను పదేళ్ల వారంటీతో అందిస్తున్నట్లు ఆర్‌సీ ప్లాస్టో పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ నిర్ణయం
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..