Share News

రెపో రేటు పెంపు 0.25 శాతమే!

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:32 AM

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) డిసెంబరు 2-4 తేదీల్లో నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్ష (ఎంపీసీ)లో కీలక రెపో రేటును 0.25 శాతం పెంచే...

రెపో రేటు పెంపు 0.25 శాతమే!

  • మరీ ఎక్కువ పెంచితే పెట్టుబడులు తరలిపోయే రిస్క్‌

  • ఎస్‌బీఐ ఆర్థికవేత్తల అంచనా

ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) డిసెంబరు 2-4 తేదీల్లో నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్ష (ఎంపీసీ)లో కీలక రెపో రేటును 0.25 శాతం పెంచే అవకాశం ఉందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో తాము అంచనా వేసిన విధంగా 0.50 శాతం అంత భారీ పెంపు ఉండకపోవచ్చని ఎస్‌బీఐ ఎకనమిక్‌ రీసెర్చ్‌ విభాగం తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక స్థిరత్వంపై నెలకొన్న ఆందోళనలే రేటు పెంపు అంచనాలను తగ్గించడానికి కారణంగా పేర్కొంది. ‘‘ద్రవ్యోల్బణం ప్రస్తుత తీరు ఆధారంగా 25 బేసిస్‌ పాయింట్లు (0.25 శాతం) పెంపు సరిపోతుంది. అంతకుమించి భారీ పెంపు చేపడితే అది పెట్టుబడులు తరలిపోయేందుకు కారణం కావొచ్చు. రూపాయిపైనా ప్రభావం పడి, దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలకు దారితీస్తుంది. కాబట్టి ఆర్థిక అస్థిరతలను దృష్టిలో పెట్టుకునే ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుంది’’అని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఫెడ్‌ రేటు పెంపు ఉండకపోవచ్చు: ఇక అంతర్జాతీయంగా చూస్తే యూఎస్‌ ఫెడ్‌ డిసెంబరు సమీక్షలో వడ్డీ రేట్ల పెంపును చేపట్టకపోవచ్చని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈక్విటీ మార్కెట్లో భారీ అమ్మకాల నేపథ్యంలో 50 బేసిస్‌ పాయింట్లు పెంచొచ్చన్న అంచనాలు తగ్గిపోయినట్టు ఈ నివేదిక పేర్కొంది. 10 ఏళ్ల జీ-సెక్‌ల ఈల్డ్స్‌ తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని, ప్రస్తుతం ఇది 4.96 శాతం వద్ద ఉండగా, 4.75 శాతం వరకు దిగిరావొచ్చని అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి:

ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!

Updated Date - Nov 25 , 2026 | 05:32 AM