Share News

డిజిటల్‌ చెల్లింపులకు ఇక రెండంచెల ధ్రువీకరణ

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:02 AM

డిజిటల్‌, సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ తీసుకున్న మరో కీలక చర్య బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ విధానం కింద డిజిటల్‌ చెల్లింపుల కోసం...

డిజిటల్‌ చెల్లింపులకు ఇక రెండంచెల ధ్రువీకరణ

న్యూఢిల్లీ: డిజిటల్‌, సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ తీసుకున్న మరో కీలక చర్య బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ విధానం కింద డిజిటల్‌ చెల్లింపుల కోసం పిన్‌ నంబర్‌ ఒక్కటీ ఎంటర్‌ చేస్తే చాలదు. దాంతో పాటు బ్యాంకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపే ఓటీపీ లేదా ఫింగర్‌ప్రింట్‌ లేదా ఫేసియల్‌ గుర్తింపు సైతం నమోదు చేయాలి. యూపీఐ, డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ప్రీపెయిడ్‌ సాధనాల ద్వారా చేసే చెల్లింపులన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ విధానం వల్ల పెద్ద మొత్తంలో చేసే డిజిటల్‌ చెల్లింపులు, కొత్త డివైజ్‌ల ద్వారా చేసే చెల్లింపులు కొద్దిగా ఆలస్యమవుతాయని బావిస్తున్నారు. అయితే ట్రస్టెడ్‌ డివైజ్‌లు, రొటీన్‌గా చేసే చిన్నపాటి చెల్లింపులకు మాత్రం ఈ ఇబ్బంది ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అలాగే బ్యాంకింగ్‌ యాప్స్‌ ద్వారా చెల్లింపులు చేసే వారు ఇక స్ర్కీన్‌ షాట్స్‌ తీసుకునే వీలుండదు.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 06:02 AM