Share News

రికవరీ ఆస్తులను డిఫాల్టర్లకు తిరిగి విక్రయించరాదు..

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:24 AM

మొండి బాకీలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులను తిరిగి ఆ రుణ ఎగవేతదారు(డిఫాల్టర్‌)కు లేదా సంబంధిత పార్టీలకు...

రికవరీ ఆస్తులను డిఫాల్టర్లకు తిరిగి విక్రయించరాదు..

బ్యాంక్‌లు, ఎన్‌బీఎ్‌ఫసీ, ఎస్‌ఎ్‌ఫబీలకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు

ముంబై: మొండి బాకీలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులను తిరిగి ఆ రుణ ఎగవేతదారు(డిఫాల్టర్‌)కు లేదా సంబంధిత పార్టీలకు విక్రయించడానికి వీల్లేదని ఆర్‌బీఐ అంటోంది. ఇందుకు సంబంధించి బ్యాంక్‌లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల(ఎస్ఎఫ్‌బీ)కు తుది మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. ఈ అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. సర్ఫేసీ చట్టం 2022 ప్రకారం బహిరంగ వేలం ద్వారానే ఈ రికవరీ ఆస్తులను విక్రయించాలని, గరిష్ఠంగా ఏడేళ్లలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ స్వాధీనం చేసుకున్న స్థిరాస్తిని సొంత అవసరానికి వాడుకోదలచితే ఆ నాటి నుంచి దాన్ని తమ స్థిరాస్తిగా పద్దుల్లో చూపాలని కూడా ఆర్‌బీఐ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 05:24 AM